జిల్లాలో కొత్త తరహా దొంగతనాలు షురూ అయ్యాయి. ఒంటరి మహిళలే టార్గెట్గా దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. రహదారుల్లో నడుచుకుంటూ వెళ్తున్న ఒంటరి మహిళలు కనపడితే చాలు.. లిఫ్ట్ ఇస్తామంటూ నమ్మించి కారులో ఎక్కించుకొని మత్తు మందు ఇచ్చి బంగారు నగలు, నగదు తస్కరిస్తున్నారు.